పౌరులకు మెరుగైన సేవలందిద్దాం: విజయవాడ కమిషనర్
విజయవాడలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న రోటరీ, లయస్ క్లబ్ ప్రతినిధులతో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ శనివారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.
నగరంలో విద్య, వైద్యం, పారిశుధ్యం, జీవనోపాధి రంగాల్లో మరింతమందికి సేవలందేలా నగర పాలక సంస్థతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని రోటరీ, లయన్ క్లబ్ ప్రతినిధులకు కమిషనర్ సూచించారు. ఇప్పటికే రోటరీ, లయన్ క్లబ్ అధ్వర్యంలో నగరంలో అనేక సేవలందిస్తున్నారని పేర్కొంటూ వారిని కమిషనర్ అభినందించారు.
ముఖ్యంగా రక్తదానం, కోవిడ్ నియంత్రణపై ప్రజలకు అవగాహన, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం, ప్రతిభ గల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం వంటి సేవలందిస్తున్నారని తెలిపారు.
సమావేశంలో రోటరీ, లయన్స్ ప్రతినిధులు కెఎన్ఎస్ఆర్ ప్రసాద్, వి.కేశవరావు, వి.వెంకటేశ్వరరావు, వై.పార్ధసారధి, రవీంద్ర, దుర్గా, జోనికుమారి, శాంతి, శంకర గుప్త తదితరులు పాల్గొన్నారు.