గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (16:03 IST)

కోర్టు ధిక్కరణ కేసు : ఏపీలో మరో ఇద్దరు ఐపీఎస్‌లకు హైకోర్టు శిక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఇద్దరు ఐపీఎస్‌లపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వారిద్దరికి జైలుశిక్షలను విధించింది. వారిలో ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలు ఉన్నారు. ఎన్నిసార్లు ఆదేశించినా హైకోర్టు ఉత్తర్వులను వారు లెక్క చేయకపోవడంతో సహనం నశించిన హైకోర్టు చివరికి శిక్ష విధించింది. 
 
హైకోర్టు తమ ఆదేశాలు అమలు చేయాల్సిన బాధ్యతల్లో ఉండి నిర్లక్ష్యం ప్రదర్శించిన చిరంజీవి చౌదరి, పూనం మాలకొండయ్యలకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే, వీరికి శిక్షలను మాత్రం ఈ నెల 29వ తేదీన ఖరారు చేయనుంది. 
 
ప్రస్తుతం హర్టీకల్చర్ సెరీకల్చర్ కమిషనర్‌గా చిరంజీవి చౌదరి ఉన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్య ఉన్నారు. పూనం మాలకొండయ్య కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమెకు వారెంట్‌ను కోర్టు జారీచేసింది.