మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:58 IST)

టీవీ యాంకర్‌గా అవతారం ఎత్తనున్న సోనూసూద్..

బాలీవుడ్ నటుడు సోనూసూద్ టీవీ యాంకర్‌గా అవతారం ఎత్తాడు. సమాజ సేవలోనూ ముందుండే సోనూ సూద్‌.. కరోనా తొలి దశ వ్యాప్తి సమయంలో ఎందరో కార్మికులకు అండగా నిలిచారు. తన దాతృత్వంతో సోషల్‌మీడియాలో హీరోగా వెలుగొందారు. ఇప్పుడు ఈ హీరో.. యాంకర్‌గా ఓ ప్రోగ్రాంను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాడు.
 
ఇండియా టుడే గ్రూపు ఇటీవల ప్రారంభించిన గుడ్‌ న్యూస్‌ టుడే ఛానల్‌లో ఒక కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించేందుకు సోనూ సూద్‌ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. గుడ్‌ న్యూస్‌ టుడే ఛానల్‌లో 'దేశ్‌ కి బాత్‌ సునాతా హూ' అనే కార్యక్రమానికి ప్రయోగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమం ప్రతీరోజు రాత్రి 9 గంటలకు గుడ్‌ న్యూస్‌ టుడే ఛానల్‌లో ప్రసారం కానుంది.
 
'ఛానెల్‌లో అతడి ఉనికి మరిన్ని శుభవార్తలతోపాటు చిరునవ్వులను తీసుకురావడానికి మా ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది. అతడిని కొత్త అవతారంలో ప్రదర్శించేందుకు సంతోషిస్తున్నాం' అని ఇండియా టుడే గ్రూప్ వైస్ చైర్‌పర్సన్ కల్లి పూరీ అన్నారు. 
 
గంట నిడివి గల ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా మానవ విజయాల స్ఫూర్తిదాయక కథనాలను ప్రసారం చేస్తారు. దీని ద్వారా ప్రజల పోరాటాలు, సంకల్పం, సాధన దేశం గర్వపడేలా చేయనుందని చెప్పవచ్చు.