శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (14:22 IST)

క‌రోనా పై సోనూసూద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌

Sonu tweet
క‌రోనా మొద‌టివేవ్‌, సెకండ్‌వేవ్‌లో సోనూసూద్ చేసిన సేవా కార్య‌క్ర‌మాలు తెలిసిందే. ప్ర‌స్తుతం మూడో వేవ్ వ‌స్తుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం, శాస్త్రవేత్త‌లు ర‌క‌ర‌కాలుగా చెబుతున్నారు. దీనిపై సోనూసూద్‌కు ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌లు అడిగాడు. దానికి సోనూసూద్ కీల‌క స‌మాధానం చెప్పారు. ఇంకా మహమ్మారి తీవ్రత దేశం లో కొనసాగుతూనే ఉంది. ఎంతోమంది పేదలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే స్తోమత లో కూడా లేరు, దేశం లో ఉపాధి అవకాశాలు సైతం సన్నగిల్లాయి.
 
ఈ సంద‌ర్భంగా సోనూసూద్ ట్వీట్ చేశాడు. తనని ఎవరో థర్డ్ వేవ్ గురించి అడిగారు. థర్డ్ వేవ్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారా అని సోనూ సూద్ ను ఒక వ్యక్తి అడగగా, సోనూ సూద్ ఇలా అన్నారు. మనం ప్రస్తుతం మూడవ వేవ్ ను ఎక్స్ పీరియన్స్ అవుతున్నాం అని అన్నారు. సామాన్యుడి ను తాకిన పేదరికం, నిరుద్యోగం థర్డ్ వేవ్ కంటే ఎక్కువ కాదు అని వ్యాఖ్యానించారు. దీనికి వాక్సిన్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. ముందుకు రండి, నిరు పేదలకు సహాయం చేయండి, ఉపాధి అవకాశాలు కల్పించండి అంటూ వెల్ల‌డించారు.