ప్రతి రోజూ జాగ్రత్తగా వుండాలంటున్న అమితాబ్
కరోనా వల్ల మనుషుల్లో ఆలోచన ధోరణి మారింది. సెలబ్రిటీలు మరింత జాగ్రత్తగా వుండాలని ఈ కరోనా వైరస్ సూచించింది. ముఖ్యంగా సినిమారంగానికి చెందిన ప్రముఖులంతా తమవంతు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసింది. ఈ విషయంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి జాగ్రత్తలు చెబుతున్నారు. ఆయన సోమవారంనాడే షూటింగ్ లో పాల్తొన్నారు. సెకండ్‌వేవ్ లాక్‌డౌన్ ఎత్తివేశాక ఆయన సోమవారం ఉదయం 7గంటలకు ముంబైలో షూటింగ్‌కు బయలుదేరాడు. తన కారులో కూర్చుని ముసుగు ధరించిన ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు.
ఆయన పాంగోలిన్ మాస్క్ ధరించారు. 800 నుంచి 5వేల వరకు వున్న ఈ మాస్క్‌ను ఆయన ధరించి చూపించాడు. ఇందులో రకరకాల మోడల్స్ కూడా వున్నాయి.ఇదిలావుండగా, ఇప్పుడు అందరం మరింత జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందనీ, ప్రతిరోజూ ఎప్పటికప్పుడు మనకు మనం మాస్క్‌లు ధరించి ఎక్కడికైనా వెళ్ళాలనే విషయాన్ని మర్చిపోకూడదని తెలియజేశారు. సినిమా షూటింగ్ అంటే రోజూ వందలాదిమందితో పనిచేయాల్సి వుంటుంది కనుక ఆయన చెప్పింది కరెక్టే అని పలువురు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రస్తుతం అమితాబ్ `బ్రహ్మాస్త్ర`, `చెహ్రె, మేడే, గుడ్‌బై చిత్రాలు చేస్తున్నారు. దానితోపాటు ఓ హాలీవుడ్ సినిమా రీమేక్‌లో నటిస్తున్నారు. ఇక ప్రభాస్, దీపికా పదుకొనే సినిమాలోనూ ఆయన నటిస్తున్నారు.