మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : బుధవారం, 16 జూన్ 2021 (23:14 IST)

అలాంటి చిరంజీవి అవసరంలేదు: మెగాస్టార్ పైన నోరు పారేసుకున్న శ్రీరెడ్డి (video)

తాజాగా శ్రీరెడ్డి విడుదల చేసిన ఒక వీడియో చర్చకు దారితీస్తోంది. ఒక్కసారిగా ఒక వీడియో విడుదల చేయడం... అది కూడా మెగాస్టార్ పై విమర్సలు చేశారు. మెగాస్టార్‌ని మాత్రమే కాదు నాగబాబును విమర్సించారు. ఇద్దరిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు శ్రీరెడ్డి.
 
కాపు కులస్తులు వైసిపికి సపోర్ట్ చేయడం లేదని అందుకే చిరంజీవి లాంటి వ్యక్తి అవసరమని చాలామంది నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో చిరంజీవిని వైసిపిలోకి తీసుకోవాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన జగన్‌కు లేదని కూడా కొంతమంది వాదిస్తున్న సమయంలో శ్రీరెడ్డి ఒక వీడియోను విడుదల చేశారు.
 
చిరంజీవి పార్టీ పెట్టి ఆ పార్టీని అమ్మేశాడు. జెండా ఎత్తేశాడు. అలాంటి వ్యక్తి మనకు అవసరం లేదు. కాపు కులస్తుల కోసం పోరాటం చేసిన ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ పార్టీలోకి తీసుకోవాలనుకుంటే అలాంటి వారు చాలామందే ఉన్నారు. వాళ్ళను తీసుకోండి తప్ప చిరంజీవి మనకు వద్దన్నా అంటూ జగన్‌కు రిక్వెస్ట్ చేస్తూ శ్రీరెడ్డి ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఈ వీడియో వైరల్‌గా మారుతోంది.