చిన్నారి అన్షి మాటలు హృదయాన్ని టచ్ చేశాయిః చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవికి పిల్లంటే ఎంతో ఇష్టం. ఆయన మెంటాలిటీ కూడా పిల్లల మెంటాలీటీయే అని తెలిసిన వారు అంటుంటారు. ఈరోజు ఓ చిన్నారి చేసిన సేవకు ఆయన ముగ్థుడయ్యారు. పి. శ్రీనివాస్, శ్రీమతి హరిణిల చిన్నారి అన్షి ప్రభాల తను ఇప్పటివరకు దాచుకున్న డబ్బులతోపాటు ఈరోజు జూన్ 1న తన పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి ఫంక్షన్ చేయకుండా ఆ డబ్బుమొత్తాన్ని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన ఆక్సిజన్ ప్లాంట్‌కు అందజేసింది.
ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ, చుట్టూ వున్న ప్రపంచం బాగున్నప్పుడే మనకు సంతోషం. ఆ చిన్నారి ఆలోనకు నిజంగా ముగ్దుడినయ్యాను. అన్షీ చూపించిన ప్రేమ హృదయాన్ని తాకింది. నన్ను సేవ చేయడానికి మరింత స్పూర్తినిచ్చింది. భగవంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్రయత్నానికి చేయూత నిచ్చాడని భావిస్తున్నాను. తను ఎంత అర్థవంతంగా మాట్లాడింది అంటూ హ్యాపీ బర్త్‌డే డార్లింగ్.. అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు చిన్నారికి. ఈ వీడియోకు అభిమానుల మంచి స్పందన వస్తోంది.