సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 31 మే 2021 (15:34 IST)

బుర్రిపాలెంలో కోవిడ్ వేక్సిన్; నిరాడంబ‌రంగా కృష్ణ జ‌న్మ‌దిన‌వేడుక‌లు

Burripalem-vaccination
మహేష్ బాబు ఈరోజు తన తండ్రి నటశేఖర కృష్ణ గారి జన్మదినం సందర్భంగా మహత్తర కార్యానికి శ్రీ‌కారం చుట్టారు. తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామం అంతటికీ ప్రస్తుత ప్రమాదకర పరిస్థితి కరోనా విపత్తు నుంచి ముక్తి కల్పించడానికి పెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టారు.  అక్కడి గ్రామస్తులు అందరికీ వ్యాక్సిన్ తన టీం తో వేయించారు. ఇలా ఒక తండ్రికి కొడుకుగా ఎంతో మంది ప్రాణాలను కాపాడి ఇంతకంటే గొప్ప బహుమానం ఇవ్వలేరని మహేష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.
 
Burripalem-Vaccination
మహేష్ బాబు ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో బుర్రిపాలెం గ్రామస్తులకు కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్‌ను స్పాన్సర్ చేశారు. ఇక మహేష్ బాబు తరచూ దాతృత్వ పనులతో ముడిపడి ఉంటాడు. 1,000 మందికి పైగా పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు. మహేష్ బాబు హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్‌తో సంబంధం కలిగి ఉంది, ఇది ఆర్థికంగా స‌రిగా లేనివారికి వైద్య ఖర్చులను భరించలేని వ్యక్తులకు మద్దతు ఇస్తుంది. తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. అతను ఆ గ్రామాలలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను పునరుద్ధరించే బాధ్యతలను స్వీకరించారు.
 
Adisehagirirao, jayadev, krishna
ఇదిలా వుండ‌గా, సూప‌ర్ కృష్ణ పుట్టిన‌రోజు వేడుక‌ను నిరాడంబ‌రంగా ఈరోజు జూబ్లీహిల్స్‌లోని అల్లుడు సుధీర్‌బాబు ఇంటిలో నిర్వ‌హించారు. సోద‌రుడు ఆదిశేష‌గిరిరావు, వియ్యంకుడు గ‌ల్లా జ‌య‌దేవ్‌, సీనియ‌ర్ న‌రేష్ ఇత‌ర కుటుంబ స‌భ్యులు హాజ‌ర‌య్యారు.