శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 4 మే 2021 (18:11 IST)

ఫైట్ సీక్వెన్స్ స్టిల్స్ వీడియోను రిలీజ్ చేసిన మ‌హేష్‌బాబు

Mahesh-1
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం 'సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఈ మూవీ ఇటీవ‌ల దుబాయ్‌లో నెల‌రోజుల పాటు షూటింగ్ జ‌రుపుకుంది. ఆ షెడ్యూల్ త‌ర్వాత  ఏప్రిల్ 13 ఉగాది ప‌ర్వ‌దినం రోజున  హైద‌రాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభించింది చిత్ర యూనిట్‌. ఈ షెడ్యూల్ ఈనెలాఖ‌రు వ‌ర‌కూ  కంటిన్యూగా జ‌రుగుతుంది. కానీ క‌రోనా ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో షెడ్యూల్ అంతా తారుమార‌యింది.
 
dubai fight
ఇప్పుడు మ‌ర‌లా షూటింగ్ ఎప్పుడు జ‌రుగుతుందో ప్ర‌శ్నార్థ‌కంగా వుంది. మ‌హేష్‌బాబు కూడా ఇంటిలోనే వున్నారు. క‌రోనా టైంలో అంద‌రూ జాగ్ర‌త్త‌గా వుండండ‌ని చెబుతూనే దుబాయ్‌లో చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు సంబంధించిన స్టిల్స్‌ను ట్వీట్ చేశాడు మ‌హేష్‌బాబు. అయితే అందులో దుబాయ్ ఫైట‌ర్లు మాత్ర‌మే క‌నిపిస్తున్నారు. ఎక్క‌డా మ‌హేష్‌బాబు త‌న ఫొటో రిలీజ్ చేయ‌లేదు.

dubai fight-1
క్రేన్‌పై కెమెరా పెట్టి కారుల‌తో యాక్ష‌న్ సీన్స్ ఎలా వుంటుందో కొంచెం రుచి చూపించాడు. దానితో అభిమానులు ఫిదా అయిపోయారు. మ‌హేష్‌బాబు, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వ‌స్తోన్న `స‌ర్కారు వారి పాట` చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.
 
dubai fight-2
సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి, సంగీతం: త‌మన్ ఎస్‌.ఎస్‌, సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్,  సీఈఓ: చెర్రీ,
నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.