Nagula chavithi: నాగుల చవితి రోజున అద్భుతం.. పుట్టనుంచి భక్తులకు నాగదేవత దర్శనం
నాగుల చవిత సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో అద్భుతం జరిగింది. పలాస మున్సిపాల్టీ పరిధిలోని శాసనం కాలనీలో నాగులచవితి సందర్భంగా భక్తులకు నాగు పాము దర్శనమిచ్చింది. నాగులచవితి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం స్థానికంగా ఓ చెట్టు కింద ఉన్న పుట్ట వద్ద భక్తులు చాలా భక్తిశ్రద్ధలతో పాలు, గుడ్లు పెట్టి పూజలు చేశారు.
అయితే వారి పూజలు ఫలించాయన్నట్లు కొంత సమయానికే ఆ పుట్టలోనుంచి పాము బయటకు వచ్చింది. అది చూసిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అయితే పాము పుట్టలోనుంచి బయటకు వచ్చే సమయంలో బయటకు రావడానికి కొంత సమయం తటపటాయించింది.
పుట్టలో నుంచి తలను బయటకు పెట్టి అటు ఇటూ చూసింది. పాము అలా చూడడంతో భక్తులంతా సైలెంట్ అయిపోయారు. అంతా సైలెంట్‌గా ఉండటంతో నెమ్మదిగా బయటకు వచ్చింది.
అటు ఇటు తిరిగి పుట్ట వద్ద పాత్రలో పెట్టిన పాలను సైతం తాగడంతో భక్తులు ఆనందంతో మునిగి పోయారు. భక్తిశ్రద్ధలతో పుట్ట ప్రాంగణమంతా పసుపు కుంకుమతో అలంకరించారు.