1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Shooting underway for Nagarjuna's 100th film, featuring Tabu.

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

Nagarjuna, Tabu
Nagarjuna, Tabu
కింగ్ నాగార్జున తన 100 సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో టబు ఓ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఇద్దరు నాయికలు వున్నారు. రా. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే 45% పూర్తైంది. టైటిల్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. వర్కింగ్ టైటిల్ గా కింగ్ 100 అని పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కోటీ ఉమెన్స్ కాలేజీలో ఓ ఆపీసుకు సంబంధించి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిస్తోంది.
 
కథా పరంగా ఇప్పటి వరకు రాని వినూత్న కథతో రా కార్తీక్ తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. లాటరీ నేపథ్యంలో సాగే కథగా, సామాన్యుడు కోటీశ్వరుడు అయ్యేలా ఎదిగే జర్నీని ఆవిష్కరించే కథగా వుంటుందని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. నాగార్జున కూడా వందవ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు అనిపిస్తోంది. పాటలు పెద్దగా లేకపోయినా నేపథ్య సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ సంగీతదర్శకుడితో చర్చలు జరుపుతున్నారు. త్వరలో ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నారు.
 
ఈ సినిమా తర్వాత నాగార్జున 101వ సినిమాగా బంగార్రాజు సినిమా సీక్వెల్ కూడా వుండనుంది. ఇప్పటికే కళ్యాణ క్రిష్న దీనిపై ఓ క్లారిటీ కథను సమకూర్చారు. బంగార్రాజు 3 పేరుతో ఈ సినిమా తెరకెక్కనుందని సన్నిహితుల సమాచారం.
తర్వాతి కథనం
NTR: ఎన్టీఆర్ చిత్రం డ్రాగన్ లో నటించడంలేదంటున్న టోవినో థామస్