సంబంధిత వార్తలు
- రామ్ చరణ్‌పై బడా నిర్మాతల అసహనం.. చిరంజీవి ఫిర్యాదు.. ఎందుకు?
- #HappyBirthdayRakulPreet గోల్ఫ్ క్రీడాకారిణికి వెల్లువెత్తుతున్న ట్వీట్స్
- ఆ హీరో వద్ద చెమట కంపు.. విజయ్ దేవరకొండ అంటే పిచ్చి: రకుల్ ప్రీత్ సింగ్
- ప్రమోషన్‌కు వచ్చిన చిత్రాలన్నీ ఫ్లాప్.. అందుకే వెళ్లడం లేదు: నయనతార
- జగన్ సార్... పీవీపీ నుంచి కాపాడండి: బండ్ల గణేశ్
బోయపాటిపై పడిన శ్రీరెడ్డి.. ఆమె లేకుండా సినిమా పూర్తి చేయరటగా?
టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీకాదు. గతంలో కూడా చాలాసార్లు ఇలాంటి కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో భాగంగా నడిరోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన చేసి పాపులర్ అయిన ఈమె.. ఇలా సోషల్ మీడియాలో పబ్లిక్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తూనే వుంది. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసింది.
గతంలో తేజతో తాజ్ బంజారా రూములో ఇలియానా అని, విశాల్ కారవాన్‌లో జరిగే బాగోతం అదే అని రకరకాలుగా సంచలనాలు సృష్టించిన ఈమె, ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్‌పై అదే రేంజ్‌లో కామెంట్ చేసింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుపై సంచలన కామెంట్స్ చేస్తూ వరుస పోస్ట్‌లను ఫేస్ బుక్‌లో షేర్ చేసింది శ్రీరెడ్డి.
''బోయపాటి గారూ.. మీరు ఆమె లేకుండా సినిమాలు కంప్లీట్ చేయరంట కదా" అంటూ రాయడానికి వీలులేని బూతు పదాలను వాడింది. అంతేకాదు సదరు నటి, ఆమె భర్త ఫొటోలను షేర్ చేసి వారిపై దారుణమైన కామెంట్స్ చేసింది. బోయపాటి గురించి, ఆ నటి గురించి వల్గర్ కామెంట్స్‌తో కూడిన పోస్ట్‌లను ఫొటోలతో సహా షేర్ చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ ఫోటోలపై నెట్టింట చర్చ మొదలైంది.
