శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (11:40 IST)

#HappyBirthdayRakulPreet గోల్ఫ్ క్రీడాకారిణికి వెల్లువెత్తుతున్న ట్వీట్స్

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్‌గా మారిపోయింది. పంజాబీ బ్యూటీ అయిన రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. దక్షిణాది, ఉత్తరాది భాషల్లో తన అందచందాలతో అలరించే రకుల్ ప్రీత్ సింగ్‌కు అక్టోబర్ 10వ తేదీ పుట్టిన రోజు. 
 
రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడే వ్యాపారరంగంలోకి అడుగుపెట్టింది. ఎఫ్ 45 పేరుతో జిమ్‌ను స్థాపించి బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. ఫిట్‌నెస్ థీమ్‌తో జిమ్ వ్యాపారంలోకి ప్రవేశించిన రకుల్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అమ్మడు శంకర్ ఇండియన్ 2 సినిమా చేస్తోంది. అక్టోబర్ 10, 1990లో ఢిల్లీలో పుట్టిన ఈ బ్యూటీ.. మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది రకుల్.  
 
చదువుకునే సమయంలోనే సినిమాల్లో నటించాలనే కోరికతో సినిమా రంగంలోకి అడుగుపెటింది. ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అలా వచ్చిన డబ్బును తన అవసరాలకు, చదువుకు ఉపయోగించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ బిఎస్సీ డిగ్రీని పూర్తి చేసింది. సినిమా రంగంలోనే కాకుండా క్రీడారంగంలోనూ అదరగొట్టింది. 
 
రకుల్ జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని కావడం విశేషం. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది. ఇకపోతే.. రకుల్ ప్రీత్ సింగ్‌కు అక్టోబర్ 10వ తేదీన పుట్టిన రోజు కావడం సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.