సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (18:10 IST)

చిరంజీవిపై పడిన శ్రీరెడ్డి.. తమ్ముడిని ఏకేసింది.. కానీ? (video)

బిగ్‌బాస్ 3 షోను హోస్ట్ చేస్తోన్న నాగార్జునను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్న శ్రీరెడ్డి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిపై పడింది. అయితే శ్రీరెడ్డిపై ఎలాంటి నెగటివ్ కామెంట్స్ చేయలేదు. ప్రశంసల వర్షం కురిపించింది.


చిరంజీవి కొత్త లుక్‌ను చూసి శ్రీరెడ్డి మెచ్చుకుంది. అందంలో అభినయంలో నటనలో డ్యాన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి గారిని అందుకోవడం ఎవరి వల్ల కాదు అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు చిరంజీవి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటుడు ఎన్టీఆర్, ఆ తర్వాత రామ్ చరణ్ అంటూ చెప్పుకొచ్చింది.
 
కాగా.. . క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లోని నటులను, అగ్ర దర్శకులను శ్రీరెడ్డి టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. అంతేకాదు అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది.


అంతేగాకుండా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను అనరాని మాటలు అనేసింది. కానీ తమ్ముడుని ఏకిపారేస్తూ.. అన్నయ్యను మాత్రం ప్రశంసలతో ముంచెత్తడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.