శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (12:09 IST)

చైతూ, సమంత ఫసక్.. మన్మథుడిగా నేనొస్తున్నా.. నాగార్జున

వేసవిలో పెద్దబ్బాయి చైతన్య మజిలీతో వచ్చాడని, మొన్న కోడలు పిల్ల సమంత బేబీ అంటూ వచ్చిందని.. ఇక ఆగస్టు తొమ్మిదో తేదీన తాను వస్తున్నానని.. ఇక చైతూ, సమంత ఫసక్ అంటూ కింగ్ నాగార్జున సరదాగా అన్నారు
.

మన్మథుడు-2 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున హుషారెత్తించాడు.మన్మథుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, కుటంబ సమేతంగా చూడవచ్చని చెప్పారు. 
 
మన్మథుడు2 సినిమా కథ ఓ ఫ్రెంచ్ సినిమా నుంచి తీసుకున్నట్టు చెప్పారు. కథ వినగానే.. తానేంటి ఈ వయసులో లవ్ స్టోరీ ఏంటి అనుకున్నానని వెల్లడించారు. అయితే ఇది తన వయసుకు తగ్గ సినిమా అని.. ప్రేమకు, రొమాన్స్‌కు వయసు లేదని చెప్పే సినిమా అన్నారు.

అందరూ తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని అనుకుంటున్నారని.. సినిమా చూశాక ఉన్నది ఇద్దరు తమ్ముళ్లు అనుకుంటారని సరదా కామెంట్ చేశారు. మన్మథుడు-2తో మజిలీ, బేబీ సినిమాలు ఫసక్ అన్నారు. 
 
ఒరిజినల్ మన్మథుడుకి ఆడవాళ్లంటే పడదు అని.. కానీ ఈ మన్మథుడికి ఆడవాళ్లంటే ఇష్టమని నాగ్ చెప్పారు. కాగా, నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మన్మథుడు 2 ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. చైతన్ భరద్వాజ్ సినిమాకు సంగీతం అందించారు.


ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు నటీనటులు నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, నాగచైతన్య, సీనియర్ నటి లక్ష్మి, అమల, వెన్నెల కిషోర్, తదితరులు హాజరయ్యారు.