సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (17:55 IST)

నానిపై శ్రీరెడ్డి బూతుపురాణం.. అమ్మో ఎన్ని మాటలు అందో?!

వివాదాస్పద నటి శ్రీరెడ్డి నేచురల్ స్టార్ నానిపై విరుచుకుపడింది. వినలేని మాటలతో బూతులు తిట్టింది. సోషల్ మీడియాను ఇతరులపై ఆరోపణలు చేసేందుకు తెగ వాడుకుంటున్న శ్రీరెడ్డి.. తాజాగా నానిని టార్గెట్ చేస్తూ తిట్ల దండకం అందుకుంది. సినిమా ఆఫర్లు ఇస్తానని చెప్పి తనను వాడుకొని వదిలేశాడని ఫైర్ అయ్యింది. నానిపైనే కాదు. చాలామందిపై శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. 
 
ఇప్పుడు మళ్లీ నానిపై ఎగిరెగిరి పడుతోంది. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలతో కోర్టుకు వెళ్తానని నాని కౌంటరిచ్చినప్పటికీ.. టార్గెట్ చేయడం మాత్రం శ్రీరెడ్డి ఆపలేదు. బూతు పురాణం లంగించుకుంది. ఫేస్‌బుక్‌లో తన నోటికి ఏదొస్తే అది వాగేసింది.
 
నాని భార్యను కూడా వదల్లేదు. నీ భార్య దగ్గర పడుకొని కూడా కోర్టులో కేసు వేస్తావా? నువ్వే నా దగ్గర పడుకొని మళ్లీ నా మీదే కేసు వేస్తావా? అంటూ రెచ్చిపోయింది. నాని.. నీ డబ్బు చూసుకొని టార్చర్ చేస్తున్నావు కదా? ఆ లక్ష్మీ నీ ఇంట్లో నుండి బయటకు వచ్చి జ్యేష్ఠ దేవి తిష్ట వేయాలి నీ ఇంట్లో.. అంటూ ఓ పోస్ట్ పెట్టింది.
 
మరో పోస్ట్‌లో ఈరోజుకి టార్చర్ చూపించే నీకు మామూలు చావు కాదురా. చేతబడి చేయించి చంపాల్రా నాని.. అంటూ, అరేయ్ నాని నీకు, నీ ఫ్యామిలీకి కూడా నా ఏడుపు తగిలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇంత టార్చర్ చూపిస్తున్న నువ్వు నాశనం అవుతావు త్వరలోనే… అంటూ పోస్టుల మీద పోస్టులు పెట్టింది. ఈ పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి నాని శ్రీరెడ్డి విషయంలో ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.