గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (12:25 IST)

అలా చేస్తే రెడ్డి సిస్టర్స్ తొక్క తీస్తారు జాగ్రత్త.. శ్రీరెడ్డి.. శ్వేతారెడ్డి

టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌ ఉదంతంలోకి వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం బిగ్ బాస్ ఆడిషన్స్‌లోనూ అదే జరిగాయని.. యాంకర్ శ్వేతా రెడ్డి, నటీమణి గాయత్రి గుప్తా ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఈ షోను నిలిపివేయాలని నిర్వహకులపై కేసులు పెట్టింది శ్వేతారెడ్డి.  
 
దీంతో శ్వేతారెడ్డికి శ్రీరెడ్డి మద్దతు లభించింది. అటు శ్రీరెడ్డి.. ఇటు శ్వేతారెడ్డి మార్గం ఒకటే కావడంతో ఈ ఇద్దరూ జతకలిశారు. ''‘లైంగిక వేధింపులకు మేము ఎప్పుడూ మద్దతు ఇవ్వము.. అలా చేస్తే రెడ్డి సిస్టర్స్ తొక్కతీస్తారు కొడుకులది" అంటూ ఘాటైన పోస్టు చేశారు. 
 
కాగా యాంకర్‌గా పలు ఛానల్స్‌లో పనిచేసి యూట్యూబ్ సంచలనంగా మారిన శ్వేతారెడ్డి.. గత ఎన్నికల్లో కేఏ పాల్‌పై సంచలన ఆరోపణలతో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అనంతరం ఇటీవల బిగ్ బాస్‌ నిర్వాహకులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సంచలనంగా మారింది. గాయిత్రి గుప్తాతో కలిసి ఢిల్లీ స్థాయిలో బిగ్ బాస్ షోపై నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.