నాగార్జునపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో లేకుంటే వెధవ (video)

Srireddy
Last Updated: మంగళవారం, 30 జులై 2019 (19:23 IST)
బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలివారంలో ఎలిమినేట్ కావడం.. ట్రాన్స్‌జెండర్ తమన్నా ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో వ్యాఖ్యాత, మన్మథుడు అక్కినేని నాగార్జునపై శ్రీరెడ్డి సంచలన కామెంట్ చేసింది.


''గారికి తెలిసినన్ని పాలిటిక్స్ చంద్రబాబు గారికి కూడా తెలియవు. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో... ఇవ్వకపోతే బిగ్ బాస్ ఒక వెధవ" అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. 
 
నాగార్జున గతంలో ఏమన్నారంటే... బిగ్ బాస్ షోపై మీ అభిప్రాయం ఏమిటి అంటూ గతంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు నాగార్జున స్పందించారు. బిగ్ బాస్ షో కాన్సెప్ట్ తనకు ఇష్టం వుండదన్నారు. పక్కింటివాడి జీవితంలోకి తొంగిచూడటం ఏం గేమ్ అన్నారు. అలాంటి వ్యక్తి అదే షోను హోస్ట్ చేయడం ఏమిటని శ్రీరెడ్డి ప్రశ్నించింది. 
 
చల్లని గాలి, ఆకాశం, కొండలు ఇలా ప్రకృతి మధ్య బతకడం తనకు చాలా ఇష్టమని.. అలాంటి తాను బిగ్ బాస్ హౌస్‌లో వారు అన్ని రోజులు, అన్ని కెమెరాల మధ్య ఎలా బ్రతుకుతున్నారని చెప్పారు. ఇంకా తాను అళా వుండలేనని.. అందుకే ఆ షో అంటే ఇష్టం లేదు. కానీ మనసు కోతి లాంటిది, ఆ షో మీ అందరికీ ఎందుకు ఇష్టమో తెలుసుకోవాలని ఉంది, అందుకే ఈసారి రంగంలోకి తాను రంగంలోకి దిగుతున్నట్లు నాగార్జున తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. 
Nagarjuna
 
ఇకపోతే..  బిగ్ బాస్ రియాల్టీ షో మీద గతంలో పెద్ద దుమారం రేగింది. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లాలంటే లైంగిక కోర్కె తీర్చాలని అడిగారంటూ శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపించారు. ఏకంగా ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదులు చేశారు. మరోవైపు బిగ్ బాస్ 3‌లో శ్రీరెడ్డికి చోటు దక్కుతుందని కూడా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.



దీనిపై మరింత చదవండి :