సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Modified: సోమవారం, 29 జులై 2019 (18:03 IST)

బిగ్ బాస్‌ను హేమ అంత మాటన్నదా...? నిజమేనా?

బిగ్ బాస్... ఇంతకుముందు జరిగిన రెండు షోలలో ఎలాంటి సమస్యలు లేకున్నా ఈసారి మాత్రం వివాదాల పుట్టగా మారింది ఈ షో. తొలుత ఇద్దరు నటీమణులు తమపట్ల బిగ్ బాస్ నిర్వాహకులు అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా ఇటీవలే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నటి హేమ బిగ్ బాస్ షో జరుగుతున్న తీరుపై షాకింగ్ కామెంట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 
 
ప్రచారంలో వున్న సమాచారం ప్రకారం... బిగ్ బాస్ హౌస్‌లో జరిగింది జరిగినట్లుగా చూపించలేదంటూ వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... తనకు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం వున్నా దాన్ని రాకుండా చేశారంటూ ఆమె ఆరోపించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్ హౌసులో గొడవ జరుగుతుంటే... తను సర్దిచెపుతుంటే... ఆ గొడవలను తానే సృష్టించినట్లు చూపించారంటూ హేమ అన్నట్లుగా పలు వెబ్ సైట్లలో ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంత వుందో తెలియాలంటే హేమ డైరెక్టుగా చెబితేనే తెలుస్తుంది.