వీరికి నేను పోటీ ఏంటి.. పిచ్చి కాకపోతే..? అనసూయ జస్ట్ ఆస్కింగ్
నాగార్జున కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని సినిమా మన్మథుడు. త్రివిక్రమ్ కథ - మాటలతో.. కె.విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమా 2002లో రిలీజైంది. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత మన్మథుడు 2 టైటిల్‌తో నాగార్జున సినిమా చేసారు. చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే... నాగ్ మన్మథుడు 2 రిలీజ్ అవుతున్న రోజునే అనసూయ కథనం సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో నాగ్‌తో పోటీపడుతున్న అనసూయ అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలపై అనసూయ ట్విట్టర్లో స్పందిస్తూ... అసలు వీళ్లకి నేను పోటీ ఏంటి.. పిచ్చికాకపోతే..? ట‌్రైలర్ చాలా బాగుంది. నాకు ఇష్టమైన నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఉన్నారు. నేను నటించిన కథనం సినిమాతో పాటు మన్మథుడు 2 చూస్తాను అని స్పందించి మన్మథుడు 2 ట్రైలర్ పోస్ట్ చేసారు.