బిగ్ బాస్-3 నుంచి ఆ నలుగురు ఔట్
ప్రముఖ టీవీ చానెల్‌లో బిగ్ బాస్ మూడో సీజన్ రియాల్టీ షో ఈ నెల 21వ తేదీ నుంచి ప్రాసరమవుతుంది. తొలి రోజున బిగ్ బాస్ ఇంట్లోకి 15 మంది కంటెస్టెంట్స్ ప్రవేశించారు. వీరంతా నీళ్లుపాలులా కలిసిపోతారని భావించారు. కానీ, రోజులు గడిచే కొద్దీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఎప్పుడు ఎవరు ఫైర్ అవుతారో, ఏ విషయం మీద గొడవపడతారో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. మొత్తానికి బిగ్ బాస్ హౌజ్‌లో ఆరు రోజుల జర్నీ సాగించిన ఇంటి సభ్యులలో ఒకరు సూట్‌కేసు సర్ధుకొని వెళ్ళే పరిస్థితి ఆసన్నమైంది. నామినేషన్‌లో రాహుల్ సిప్లిగంజ్, హేమ, జాఫర్, వితిక, హిమజ, పునర్నవి భూపాలం ఉండగా హిమజ, పునర్నవి సేఫ్ జోన్‌లోకి వెళ్ళారు. మిగతా నలుగురిలో ఒకరు ఆదివారం బిగ్ బాస్ హౌజ్‌ని వీడనున్నారు.
బిగ్ బాస్ సీజన్ 3లో తొలి శనివారం. మ..మ.. మాస్ అంటూ నాగ్ రాకింగ్ ఎంట్రీ ఇచ్చారు. ముందు రోజు జరిగిన కొన్ని సన్నివేశాలని మన టీవీలో చూపించిన నాగ్ ఆ తర్వాత వారితో పలు ముచ్చట్లు పెట్టారు. బయట ఎంతో గంభీరంగా ఉండే జాఫర్‌కి తన భార్య గుర్తు రావడంతో చిన్నపిల్లాడిలా ఏడ్చాడు.
ఆ తర్వాత బాబా భాస్కర్ పర్యవేక్షణలో మూన్ వాక్ చేసి అందరికి నవ్వు తెప్పించాడు. ఇక 19 ఏళ్ళ వయస్సులో లేచిపోయి పెళ్లి చేసుకున్న తనని తన భర్త ఎంత మంచిగా చూసుకున్నారో వివరించి కన్నీళ్ళు పెట్టుకుంది శివజ్యోతి. గత సీజన్ మాదిరిగా కాకుండా ఈ సీజన్‌లో నాగ్ ఇంటి సభ్యుల పాజిటివ్ విషయాలని మాత్రమే మాట్లాడారు. హౌజ్‌లో జరిగిన గొడవలని ఎక్కడ ప్రస్తావించకపోవడం విశేషం.
ఇకపోతే, ఎలిమినేషన్ టైం ఆసన్నమైందని చెప్పిన నాగ్ ఆరుగురిలో మొదటగా సేఫ్ జోన్‌కి వెళ్లిన కంటెస్టెంట్‌గా హిమజని ఎంపిక చేశారు. ఆ తర్వాత పునర్నవి సేఫ్ జోన్‌లో ఉన్నట్టు తెలిపారు నాగార్జున. మిగతా నలుగురు రాహుల్, వితికా, జాఫర్, హేమలలో ఒకరు ఈ రోజు బిగ్ బాస్ హౌజ్‌ని వీడనున్నారు. ఎలిమినేషన్‌లో రాహుల్ సిప్లిగంజ్ పేరే ఎక్కువగా వినిపిస్తుండగా, బిగ్ బాస్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం మీద 15 మంది కంటెస్టెంట్స్‌లలో నలుగురు షో నుంచి నిష్క్రమించనున్నారు.