శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (12:12 IST)

సీన్లోకి శ్రీరెడ్డి-శ్వేతారెడ్డితో బిగ్ బాస్ 3 అట్టర్ ఫ్లాప్.. శిఖండిని అడ్డంపెట్టుకుని?

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ లైన్లోకి వచ్చేసింది. టాప్ హీరోలపై ఆరోపణాస్త్రాలు సంధిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. నిన్న నేచురల్ స్టార్ నానిపై బూతుపురాణం లగించుకున్న శ్రీరెడ్డి.. ఈరోజు బిగ్ బాస్ మూడో సీజన్‌పై పడింది. తాజాగా బిగ్ బాస్ షోను టార్గెట్ చేస్తూ కామెంట్లు  చేసింది.  తెలుగు బిగ్ బాస్ షో తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పేసింది. 
 
ఇక్కడ షో ఎప్పుడో నాశనం అయిపోయిందని సంచలన కామెంట్స్ చేసింది. దీనికి తగ్గట్లుగానే మరో యాంకర్ శ్వేతా రెడ్డిని ఉద్దేశ్యించి పోస్ట్ కూడా చేసింది శ్రీరెడ్డి. ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను చూపిస్తూ ''నా సపోర్ట్ మీకే" అంటూ శ్రీరెడ్డి రాసుకొచ్చింది. 
 
''శ్వేతారెడ్డి గారూ.. మీ దెబ్బకి బిగ్ బాస్ తెలుగు అట్టర్ ఫ్లాప్ అయింది.. నాకు కూడా తమిళ బిగ్ బాస్ బాగా నచ్చింది కానీ తెలుగు కాదు.. నా సపోర్ట్ మీకే" అంటూ శ్రీరెడ్డి పోస్టు చేసింది. అంతేగాకుండా శ్వేతా రెడ్డితో గతంలో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. దీనికి రెడ్డి పవర్ అనే క్యాప్షన్ పెట్టడం మరింత వివాదాస్పదంగా మారింది. ఇక అక్కడితో ఆగకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నాపై కూడా శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. 
 
తమన్నాను టార్గెట్ చేస్తూ బిగ్ బాస్‌కు బిగ్ భయ్యా దొరికాడంటూ రెచ్చిపోయింది. దాంతో పాటు నాగార్జున భయ్యా సెలక్షన్ సూపర్ అంటూ సెటైర్లు విసిరింది శ్రీరెడ్డి. అక్కడితో ఆగకుండా నాగార్జునపై ఇటీవల వ్యక్తిగత ఆరోపణలు కూడా చేసింది. 
 
తాజాగా తమన్నా రచ్చపై కూడా ఆమె నోరు పారేసుకుంది. శిఖండిని అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తున్న బిగ్ బాస్... తూ.. తెలుగు బిగ్ బాస్ నాశనం అంటూ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి కామెంట్స్‌ను పక్కనబెడితే తమన్నా ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లో పరిస్థితులు మాత్రం ఒక్కసారిగా మారిపోయాయి. అదన్నమాట సంగతి.