బిష్ణోయ్ గ్యాంగ్ ప్రధాన టార్గెట్ అమీర్ ఖాన్.. టైగర్ ష్రాఫ్ కాదు...
ఇటీవల బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు తుపాకీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాలతో బయటపడగా, ఆయన కారు డ్రైవర్ మాత్రం గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద జరిపిన విచారణలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బిష్ణోయ్ గ్యాంగ్ అసలు టార్గెట్ టైగర్ ష్రాఫ్ కాదని, బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్ అని పోలీసులు వర్గాలు వెల్లడించాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న షూటర్లు మొదట ఆమిర్‌పై దాడికి పక్కా ప్రణాళికతో ముంబైకి వచ్చినట్లు విచారణలో తేలింది. ఈ వార్త బాలీవుడ్లో తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. హర్యానాకు చెందిన ఇద్దరు షూటర్లు సెప్టెంబరు 20వ తేదీకే ముంబైకి చేరుకున్నారు. ఆ తర్వాత పలుమార్లు ఆమిర్ ఖాన్ నివాసం వద్ద రెక్కీ నిర్వహించి, ఆయన కదలికలను గమనించారు. అయితే, ఆమిర్ ఖాన్ ఎక్కువగా ఇంటికే పరిమితం కావడం లేదా పని నిమిత్తం నగరం బయట ఉండటంతో ఆయనపై దాడి చేయడం కష్టమని షూటర్లు భావించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో తమ ప్రణాళికను మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈ దాడి ప్రణాళిక వెనుక ఉన్న కారణాలను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది జులైలో గౌరీ స్పాట్‌ను ఆమిర్ ఖాన్ వివాహం చేసుకున్న తర్వాత, అతనికి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో కొన్ని సోషల్ మీడియా పోస్టులు, వాయిస్ నోట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి.
ఆమిర్ ఖాన్ 'లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తున్నారని ఆ పోస్టులలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ బెదిరింపులు నిజమైనవేనని అప్పట్లో ముంబై పోలీసులు కూడా ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలోనే ఆమిర్పైదాడికి కుట్ర జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

