రెగ్యులర్ షూటింగ్ లో ఉపేంద్ర గాడి అడ్డా
Kancharla Upendra, Savitri Krishna
దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, "చక్కటి కమర్షియల్ అంశాలతో కూడుకున్న మాస్ సినిమా ఇది. ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టు యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. హీరో పాత్ర పక్కా మాస్ అయితే హీరోయిన్ పాత్ర బాగా డబ్బున్న అమ్మాయిగా ఉంటుంది" అని చెప్పారు.
"నటించడానికి ఎంతో అవకాశం ఉన్న పాత్రలను పోషిస్తున్నాం. కెరీర్ ను మలుపు తిప్పే చిత్రమవుతుంది" అని హీరో కంచర్ల ఉపేంద్ర, హీరోయిన్ సావిత్రి కృష్ణ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రవీందర్ సన్, సంగీతం: రాము అద్దంకి, ఎడిటింగ్: క్రాంకి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె నరేశ్ కల్యాణి.

