సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (16:01 IST)

'నీతోనే నేను' సినిమా నుంచి "గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు.." లిరికల్ సాంగ్ విడుదల

moksha
"సినిమా బండి" ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం "నీతోనే నేను". చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఉపాధ్యాయుల దినోత్సవం (టీచ‌ర్స్ డే) సందర్భంగా 'గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..' లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 
 
గొప్ప స‌మాజం రూప క‌ల్ప‌న‌లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీల‌కం. అందుక‌నే వారిని బ్ర‌హ్మ‌, విష్ణు, మ‌హేశ్వ‌రుల‌తో పోలుస్తుంటారు. అలాంటి టీచ‌ర్స్‌కు అంకిత‌మిచ్చేలా ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ పాట‌ను రూపొందించారు. ప్ర‌ముఖ సింగ‌ర్ మ‌నో పాడిన ఈ పాట‌ను స్టార్ రైట‌ర్ సుద్ధాల అశోక్ తేజ రాశారు. 
 
ఈ పాట సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ "మంచి సమాజం కావాలంటే మనకు గొప్ప ఉపాధ్యాయులు కావాలి. టీచ‌ర్స్ వ‌ల్లే అది సాధ్య‌మ‌వుతుంది. అలాంటి వారి గొప్ప‌తనాన్ని తెలియ‌జేసేలా మా సినిమాలో ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ పాట ఉంది. ప్ర‌ముఖ సింగ‌ర్ మ‌నో, రైట‌ర్ సుద్ధాల అశోక్ తేజ‌ రాసిన ఈ పాట‌ను టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌టం ఎంతో ఆనందంగా ఉంది. మంచి టీమ్ స‌పోర్ట్‌తో సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాం. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశాను. రామ్ అనే పాత్ర కూడా గవర్నమెంట్ టీచర్. అందులోని లోపాలను సరిదిద్దేక్రమంలో జరిగే కథే ‘నీతోనే నేను’.  హీరో వికాస్, హీరోయిన్లు మోక్ష, కుషి అందరికీ థాంక్స్. . త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం. కార్తీక్ సంగీతం అద్భుతంగా ఉంటుంది. మా సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది" అని అన్నారు.
 
డైరెక్టర్ అంజి రామ్ మాట్లాడుతూ "టీచర్స్ డే సందర్బంగా మా సినిమా నుంచి ‘గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు..’ పాటను విడుదల చేయటం ఆనందంగా ఉంది. సుద్ధాల అశోక్ తేజ‌ రాసిన ఈ పాట‌ను మ‌నోగారు అద్భుతంగా పాడారు. పాట అంద‌రికీ న‌చ్చుతుంది" అన్నారు. 
 
న‌టీనటులు:
వికాస్ వ‌శిష్ట‌, మోక్ష‌, కుషిత, అకెళ్ల త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌:  శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాత‌:  ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: అంజిరామ్‌
సంగీతం:  కార్తీక్ బి.క‌డ‌గండ్ల‌
సినిమాటోగ్రాఫ‌ర్‌:  ముర‌ళీ మోహ‌న్