గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (12:30 IST)

చంద్రముఖి-2.. కంగనా రనౌత్ డ్యాన్స్‌పై ట్రోల్స్

Kangana
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ 'చంద్రముఖి 2' సినిమాలోని ఓ పాటలో భరతనాట్యం చేసింది. అయితే ఈ డ్యాన్స్ ద్వారా ఆమె బ్యాడ్ డ్యాన్సర్ అంటూ ట్రోల్స్‌కు గురవుతోంది. 
 
కంగనా రనౌత్ కొత్త 'చంద్రముఖి 2' పాట 'స్వగతాంజలి'లో ఆమె భరతనాట్యంపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కంగనా రనౌత్ తన రాబోయే తమిళ చిత్రం 'చంద్రముఖి 2' నుండి ఇటీవల విడుదల చేసిన 'స్వగతాంజలి' పాటకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 
 
ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ పాటలో నటి భరతనాట్యం నృత్యం చేసింది. అయితే భరత నాట్యపు కళను చెడు పేరు తెచ్చిపెట్టిందని ఆమెను ట్రోల్ చేస్తున్నారు. 
 
ఈ క్లాసికల్ సాంగ్ కోసం పలువురు కీరవాణిని ప్రశంసించగా, ఆ పాటలో కంగనా రనౌత్ భరతనాట్య ప్రదర్శనకు మాత్రం పలువురు ట్రోల్ చేశారు.