సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (12:01 IST)

చంద్రముఖి 2 నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ రిలీజ్

Kangana Ranaut
Kangana Ranaut
బాాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2’. స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, నటుడు రాఘ‌వ లారెన్స్ హీరోగా నటిస్తున్న చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. హార‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన చంద్ర‌ముఖి చిత్రానికి కొన‌సాగింపుగా ఇప్పుడు ‘చంద్రముఖి 2’ సినిమాను రూపొందిస్తున్నారు. శనివారం ఈ సినిమా నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
 
ఫస్ట్ లుక్ ను గమనిస్తే...రాణి వేషంలో కంగనా రనౌత్ కనిపిస్తున్నారు. ఆ లుక్ లో రాజసం క‌నిపిస్తుంది. కాగా, 2005లో పి.వాసు ద‌ర్శక‌త్వంలో రూపొందిన ‘చంద్ర‌ముఖి’ కి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రానుంది. భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు. ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ మూవీకి ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆంథోని ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.