శనివారం, 12 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (15:51 IST)

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది : మెగాస్టార్ చిరంజీవి

Chiru, naveen, mahesh
Chiru, naveen, mahesh
న‌వీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాను ఆద్యంతం తనను ఆకట్టుకుందని, ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ను ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి అన్నారు. నవీన్ పోలిశెట్టి, అనుష్క నటనను మెగాస్టార్ అప్రిషియేట్ చేశారు.
 
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేశారంటూ హీరో నవీన్ పోలిశెట్టి, యూవీ క్రియేషన్స్ విక్కీ, డైరెక్టర్ పి.మహేశ్ బాబును అభినందించారు.
 
మెగాస్టార్ చిరంజీవి స్పందన చూస్తే - 'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత  ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్  చేస్తూ తీసుకున్న సరికొత్త  కధాంశం, 'జాతి రత్నాలు' కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని  అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి  'దేవసేన', అనూష్క శెట్టి లు ఈ చిత్రానికి  ప్రాణం పోశారు. ఫుల్ లెంగ్త్  ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్  చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన  డైరెక్టర్ మహేశ్ బాబుని అభినందించాల్సిందే. ఈ  చిత్రానికి  తొలి ప్రేక్షకుడ్ని  నేనే.. ఆ  హిలేరియస్ మూమెంట్స్  ఎంతగానో ఎంజాయ్  చేశాను. మరోసారి థియేటర్ లో  ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన  కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి వందశాతం ఆడియన్స్ ని నవ్వుల బాట  పట్టిస్తారనటంలో సందేహం లేదు!!!. అని పేర్కొన్నారు.
 
యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఈ నెల 7వ తేదీన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.