వేటాడతా మూవీ షూటింగ్ ప్రారంభం
Arun, Srujana clapby venkat
ఈ సందర్భంగా నిర్మాత అంకయ్య ఎమ్ మాట్లాడుతూ...``మా బేనర్ లో `మాయా మహల్` మొదటి చిత్రం. మరో రెండు చిత్రాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మా అబ్బాయి అరుణ్‌ని హీరోగా పరిచయం చేస్తూ నాలుగో చిత్రంగా `వేటాడతా` నిర్మిస్తున్నా. మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలపై సినిమా ఉంటుంది. ఇందులో నేను టైటిల్ రోల్ చేస్తున్నా`` అన్నారు.
దర్శకుడు సురేష్ రెడ్డి మాట్లాడుతూ..`` బరి` సినిమా దర్శకుడుగా నాకు మంచి పేరు తెచ్చింది. `వేటాడతా` నా రెండో సినిమా. ఓ రోజు అంకయ్య గారు స్ర్కిప్ట్ ఇచ్చి చదవమన్నారు. స్క్రిప్ట్ నాకు చాలా నచ్చింది. అందుకే డైరక్షన్ చేయడానికి ముందుకొచ్చాను. సస్పెన్స్ అండ్ మర్డర్ మిస్టరీతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో అంకయ్య గారు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వాళ్ల అబ్బాయి అరుణ్ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ నెలాఖరులో షెడ్యూల్ ప్రారంభించనున్నాం. అరకు, నంద్యాల, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందులో సీనియర్ ఆర్టిస్ట్స్ కూడా నటిస్తున్నారు`` అన్నారు.
హీరోయిన్ సృజన మాట్లాడుతూ..``హీరోయిన్ గా నాకు ఇది తొలి సినిమా. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు`` అన్నారు.
హీరో అరుణ్ మాట్లాడుతూ..``హీరోగా నటిస్తున్న నా తొలి సినిమా ఇది. మా నాన్నగారు మంచి కథ సిద్ధం చేశారు. డైరక్టర్ సురేష్ రెడ్డి గారు మంచి ప్లానింగ్ తో సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు`` అన్నారు.
