విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ
Vijay Devarakonda
టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సామ్రాజ్యం అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లోగడ మమ్ముట్టి నటించిన సినిమా టైటిల్ కూడా ఇదే. మాఫియా నేపథ్యంలో కథ వుంటుంది. మరి విజయ్ దేవరకొండ కథ ఇంతవరు లీక్ కాలేదు. తాజా అప్డేట్‌ను ఫిబ్రవరి 7న రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. అంత వరకు విజయ్ దేవరకొండ అప్ డేట్ కోసం అభిమానులు వేచి చూడాల్సిందే.
