మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 27 జనవరి 2025 (09:58 IST)

మాస్ జాతర లో రవితేజ తనమీదే సెటైర్ వేసుకున్నాడా !

Ravi Teja- Mass Jatara
Ravi Teja- Mass Jatara
మాస్ మహారాజా రవితేజ కథనాయకుడిగా నటిస్తున్న 75వ చిత్రం 'మాస్ జాతర'. రవితేజ పుట్టినరోజుగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. తన ఫేస్ ను అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ తనను తానే ముందుపెట్టుకున్న సన్నివేశంతోపాటు యాక్షన్ జాతరలో భాగంగా పోలీస్ డ్రెస్ తో అలరించాడు. అదేవిధంగా చివర్లో అదే అద్దం ముందు కాసేపు నిలుచుని మాటల్లేకుడా ఛీ అనే అభినయంతో ముగుస్తుంది. వెంకటేష్ లా వయస్సు పైనా సెటైర్ వేసుకున్నట్లుగా అనిపిస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 
ఇక ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. 
 
'మాస్ జాతర' గ్లింప్స్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ గ్లింప్స్, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మునుపటి అసలు సిసలైన మాస్ మహారాజా రవితేజను గుర్తు చేసేలా ఉంది. తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ డైలాగ్ డెలివరీ మరియు ఎనర్జీకి పెట్టింది పేరు రవితేజ. అందుకే ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంటాయి. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్టైనర్ గా మాస్ జాతర రూపొందుతోందని గ్లింప్స్ ను చూస్తే అర్థమవుతోంది.
 
రవితేజ సినీ ప్రస్థానంలో "మనదే ఇదంతా" అనే డైలాగ్ ఎంతటి ప్రాముఖ్యత పొందినదో తెలిసిందే. గ్లింప్స్‌ కు ఈ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది అభిమానులను మళ్ళీ ఆ రోజులకు తీసుకొని వెళ్తుంది. అలాగే నేటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.
 
దర్శకుడు భాను బోగవరపు మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా 'మాస్ జాతర' గ్లింప్స్‌ ను మలిచారు. మాస్ మహారాజాగా రవితేజ మాస్ ప్రేక్షకులకు ఎందుకు అంతలా చేరువయ్యారో ఈ గ్లింప్స్‌ మరోసారి రుజువు చేస్తోంది. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం, రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఉండటమే కాకుండా, గ్లింప్స్‌ కు ప్రధాన బలంగా ఉంది.
 
ఈ చిత్రానికి ప్రముఖ ఛాయగ్రాహకుడు విధు అయ్యన్న కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. నందు సవిరిగాన సంభాషణలు సమకూర్చారు.
 
రవితేజ-శ్రీలీల జోడి 'ధమాకా' తర్వాత వస్తున్న చిత్రం 'మాస్ జాతర. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
 
సాంకేతిక బృందం: దర్శకత్వం: భాను బోగవరపు, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, రచన: భాను బోగవరపు, నందు సవిరిగాన, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: విధు అయ్యన్న, కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ.