గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2024 (19:17 IST)

నాకింకా పెళ్లి వయస్సు రాలేదు : శ్రీలీల కామెంట్

Srileela latest
తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన  ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ తమ యొక్క మరో ప్రతిష్టాత్మకమైన షాపింగ్‌ మాల్‌ను నేడు మన కూకట్ పల్లి (కె పి హెచ్ బి పిల్లర్ నంబర్ 771) సినీ నటి శ్రీలీల ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన చిట్ చాట్ జరిగింది.
 
నెలకెన్ని సార్లు షాపింగ్ చేస్తారనే ప్రశ్నకు...  షాపింగ్ లన్నీ అమ్మ చూసుకుంటుంది. నాకు నచ్చిన నగలు, దుస్తులు అన్నీ అమ్మే చూసుకుంటుంది. కొత్త బట్టలు వేసుకోవాలంటే ఇంట్లో పూజ వున్నప్పుడు, ఉగాది పండుగకు, మేరేజ్ సీజన్ లలో కొత్త కాస్ట్యూమ్స్ ధరిస్తాను. అని చెప్పింది. మేరేజ్ సీజన్ అంటే మీకు మేరేజ్ జరిగినప్పుడా? అని కొంటె ప్రశ్న వేయగానే, నాకింకా పెండ్లి చేసుకునే వయస్సు రాలేదు అంతే కొంటెగా సమాధానం చెప్పి. రెండు కన్నుబొమ్మలు ఎగరేస్తూ అలరించింది.
 
ఇంకా ఈ షోరూమ్  శ్రీ మాధవరం కృష్ణారావు కూకట్ పల్లి (ఎమ్మెల్యే), శ్రీ అరికపూడి గాంధీ శేరిలింగంపల్లి ( ఎమ్మెల్యే), శ్రీ నవీన్  కూకట్ పల్లి (ఎమ్మెల్సీ)  గార్ల చేతుల మీదుగా అంగరంగవైభవంగా ప్రారంభోత్సవం  జరుపుకున్నది. 
 
మార్కెట్ ధరల కన్నా తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నామని ఈ షాపింగ్ మాల్ ద్వారా మరో 300 మందికి ఉపాధి కల్పిస్తున్నామని సంస్థ అధినేత శ్రీ అల్లక సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రారంభోత్సవ వేడుకను ఇంతటి ఘన విజయం చేకూర్చినందుకు కస్టమర్లకు మరియు పోలీస్ శాఖ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.