1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2024 (17:23 IST)

ఈగిల్ లో అనుపమ పరమేశ్వరన్ మెప్పించగలిగిందా?

Anupama Parameswaran
Anupama Parameswaran
రవిజేత తాజా సినిమా ఈగల్ లో యూత్ ను అనుపమ పరమేశ్వరన్ మెప్పించిందా లేదా? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమాలో రవితేజదే పైచేయి. కానీ అతన్ని నడిపే కథగా అనుపమ పరమేశ్వరన్ తీసుకుంది. దర్శకుడు ఆమెపై పూర్తి భారం వేశాడు. కానీ కొన్ని చోట్ల ఆ పాత్రకు ఆమె సరిపోయిందా లేదా? అనే డౌట్ కూడా మొదట్లో రవితేజకు వచ్చిందట. కానీ కథ ప్రకారం అంతాహీరో భుజస్కందాలపై నడవడంతోపాటు సరి కొత్త యాక్షన్ అంశాలు వుండడంతో పెద్ద పాత్రను ఆమె చేసిన పెద్దగా స్పందన లేదని తెలుస్తోంది.
 
హీరో గతాన్ని విప్పే జర్నలిస్ట్ పాత్రను అనుపమ పోషించింది. ఆమె పాత్రలో తెలుగు సినిమా కథానాయికకు ఉన్న గ్లామర్ పూర్తిగా లేదు. దీనికి విరుద్ధంగా, సిద్ధు జొన్నలగడ్డ యొక్క “టిల్లు స్క్వేర్”లో అనుపమ, థియేటర్లలో యూత్ ఆడియన్స్‌ని తన కోసం వెర్రితలలు వేసుకునేలా చేస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎట్రాక్ట్ గా వుంటుంది. అలాంటి ఆమె రవితేజ సినిమాలో మాత్రం సాదాసీదా పాత్ర పోషించింది. అయినా కథంతా ఆమె తోనే రన్ కావడంతో అంగీకరించిందని తెలుస్తోంది. ఇక కావ్య థాపర్ పాత్ర నిడివి చాలా తక్కువ. ఆమెతో హీరోకున్న సన్నివేశాలు ఒకటి, రెండు మినహా లేవు. ఇప్పటికే మాస్ ప్రేక్షకులకు ఈగల్ బాగా ఆకట్టుకుటుందని తెలుస్తోంది. దర్శకుడు సక్సెస్ టూర్ లో వున్నాడు.