మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (11:16 IST)

ఈగెల్ తో రవితేజ విధ్వంస దాడితోనైనా గట్టెక్కుతాడా?

eegal- poster
eegal- poster
ఈమధ్య తెలుగు సినిమాలలో యాక్షన్ పేరుతో ఒకరకమైన విధ్వంసం చోటు చేసుకుంటుంది. ఉక్రెయిన్, రష్యా తరహాలో బాంబులు, కత్తులతో దాడులు రక్తం ఏరులై పారడం చూస్తున్నాం. ఒక దశలో విసిగుపుట్టినా ఈనాటి ట్రెండ్ లో హింసాధోరణి పెరిగిందేమో అన్నట్లుగా కొన్ని సినిమాలు ఆడుతున్నాయి. కానీ వెంకటేష్ నటించిన సైంధవ్ లో విధ్వంస చాలా వుండడంతోపాటు ఇతర కారణాలతో డిజాస్టర్ గానిలిచింది. 
 
మాస్ మహరాజా రవితేజ కూడా ఈగల్ తో రేపు అమావాస్య నాడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇందులో పద్దతైన విధ్వంసం అంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. చేతిలో బాంబును చూపిస్తూ ఈసినిమాలో ఎంత విధ్వంసం వుంటుందో తెలియపర్చాడు.  గతంలో రావణాసుర చిత్రం ప్రయోగాత్మకగా తీసి డిజాస్టర్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు కూడా పెద్దగా లాభించలేదు. ఇదే విషయాన్ని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనిని అడిగితే, ఇది తప్పకుండా ప్రేక్షకులు నచ్చే అంశం అంటూ తెలిపారు.
 
ట్రైలర్ చూశాక కథ మీద అంచనాలు లేకుండా ఫుల్ మాస్ కథతో వున్నట్లుగా అనిపిస్తుంది. ఈగిల్ అంటే డేగ లాంటి వ్యక్తా? అనేది తెలియాల్సివుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి నుంచి తప్పుకోవడం కూడా బెటర్ అనే వారూ వున్నారు. ఇప్పుడు సోలోగా రావడంతో పెద్ద సినిమాలు ఏవీ విడుదలకాకుండా ఆపివేయడంలో ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు విజయం సాదించారు. ఆయన పంపిణీ సంస్త రిలీజ్ చేస్తున్న ఈగల్ కు కావాల్సినన్ని థియేటర్లు వున్నాయి. వీటితోనే వారం రోజుల్లో కలెక్షన్లు వస్తాయని అంచనావేస్తున్నారు.
 
అయితే సినిమా రిజల్ట్ బట్టి కాకుండా ఈగల్ నిర్మాత విశ్వప్రసాద్ మరో సినిమా రవితేజతో చేయడానికి సిద్ధం అయ్యారు. రవితేజతో తనకూ ఆలోచనలు సింక్ అయ్యాయనీ, అలాంటి హీరో మాకు లభించడం అద్రుష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. దాదాపు ఈ ఏడాది  18 సినిమాలు ఆయన బేనర్ నుంచి రాబోతున్నాయి.  ఇక ఈగల్ హిట్ పై చిత్ర యూనిట్ ధీమాగా వుంది. ప్రేక్షకులు ఏమి తీర్పు ఇస్తారో చూడాలి.