బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 జనవరి 2024 (11:02 IST)

దిల్ రాజు బ్రాండ్ తో లక్ష్ చదలవాడ చిత్రం ధీరకు క్రీజ్

Dil Raju, Laksh
Dil Raju, Laksh
టాలీవుడ్ సర్కిల్‌లో దిల్ రాజుకున్న బ్రాండ్ గురించి తెలిసిందే. దిల్ రాజు చేయి పడితే ఆ ప్రాజెక్ట్ స్థాయి మారిపోతోంది. నిర్మాతగానూ, డిస్ట్రిబ్యూటర్‌గానూ దిల్ రాజుకు ఉన్న అనుభవం అటువంటిది. ఓ సినిమాను అంచనా వేయడంలో ఆయన శైలి ప్రత్యేకం. అలాంటి దిల్ రాజు ప్రస్తుతం లక్ష్ చదలవాడ సినిమాను తీసుకున్నాడు. నైజాం, వైజాగ్ హక్కుల్ని దిల్ రాజు తీసుకున్నారు. దీంతో ధీర మీద అందరి దృష్టి మరింతగా పడింది.
 
లక్ష్ చదలవాడ ‘ధీర’ అంటూ ఓ మంచి కమర్షియల్ సబ్జెక్టుతో రాబోతున్న సంగతి తెలిసిందే. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు.  విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. 
 
ఆల్రెడీ ధీర గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద బజ్‌ను క్రియేట్ చేశాయి.  ధీర సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇక దిల్ రాజు బ్రాండ్ మీద ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో ఆడియెన్స్‌లోనూ ధీర మీద మరింత ఆసక్తి పెరిగింది.