బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (17:51 IST)

రాంబో,టెర్మినేటర్ లాంటి సినిమా ఈగల్ : డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని

director karthik
director karthik
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో  దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని 'ఈగల్' విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
 
ఈగల్ ప్రమోషనల్ కంటెంట్ లో అంతా విద్వంసం కనిపిస్తోంది? అసలు ఈగల్ ఎలా ఉండబోతుంది ?
-ఈగల్ కాన్సెప్ట్ లోనే విధ్వంసం వుంది. ఇది లార్జర్ దెన్ లైఫ్ ఎంటర్ టైనర్. అతని విధ్వంసం సమాజం కోసమే. అదేమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో కథానాయకుడు పత్తిపండించే రైతులా వుంటారు. అయితే అతను పోరాడుతున్న సమస్య అంతర్జాతీయంగా వుండేది. మనకి కూడా రిలవెంట్ గా వుంటుంది. రాంబో, టెర్మినేటర్ లాంటి సినిమాలని చాలా ఎంజాయ్ చేస్తాం. అలాంటి ఒక సినిమా తీసుకురావాలనే ప్రయత్నం. ఈగల్ అద్భుతమైన యాక్షన్ డ్రామా ఎంటర్ టైనర్. ఖచ్చితంగా ప్రేక్షకులకు చాలా ఎంజాయ్ చేస్తారు.  
 
దర్శకుడిగా రెండో సినిమానే ఇంత పెద్ద యాక్షన్ చేయడం ఎలా అనిపించింది ?
-నాకు ముందు నుంచి యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం. అయితే కెరీర్ బిగినింగ్ లో కొన్ని పరిమితులు వుంటాయి. ఇప్పుడు ఈగల్ తో పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది.  
 
రవితేజ గారికి ఈ కథ ఎప్పుడు చెప్పారు ?
-రవితేజ గారితో 'ధమాకా' సినిమాకి కెమరామ్యాన్ గా పని చేస్తున్న సమయంలో ఈ కథ ఆయనకి చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే ..''ఇది మంచి కమర్షియల్ సినిమా..  చేసేద్దాం'' అన్నారు.
 
నాకు నచ్చిన పాత్ర చేశానని రవితేజ గారు ప్రీరిలీజ్ ఈవెంట్ చెప్పడం ఎలా అనిపించింది ?
-రవితేజ గారు బ్రిలియంట్ యాక్టరని అందరికీ తెలుసు. కానీ కొన్ని సార్లు కమర్షియల్ రీజన్స్ వలన ఒకే సినిమాలో కామెడీ డ్యాన్స్ యాక్షన్ ఇలా చాలా రకాలు చేయాల్సివస్తుంది. ఈగల్ లో మాత్ర ఆయన ఒక క్యారెక్టర్ లానే కనిపిస్తారు. ఆ తేడా చూసే ప్రేక్షకులకు అర్ధమౌతుంది. ఇంటెన్స్ గా ఉంటూ కూల్ గా వుండటం ఆయనలో  డిఫరెంట్ క్యాలిటీ.  
 
ట్రైలర్ లో కథ, కాన్సెప్ట్  గురించి కాస్త హింట్ కూడా ఇవ్వలేదు కదా.. స్క్రీన్ ప్లే ప్రత్యేకంగా ప్రయత్నించరా ?
-ఈ కథకు సెకండరీ కాస్ట్ చాలా ముఖ్యం. ఆ పాత్రల ద్వారా కథానాయకుడు ఎవరనే చెప్పే స్టయిల్ ని ఎక్స్ ఫ్లోర్ చేశాం. విరుమాండి, రషోమన్, విక్రమ్ తరహా శైలి ప్రయత్నించాం. కాన్సెప్ట్ అంతా ముందే చెప్పేస్తే ఆ ఎక్సయిట్మెంట్ పోతుంది. సినిమా చూశాకా మీరు ట్రైలర్ చూస్తే.. కాన్సెప్ట్ క్లియర్ గా ట్రైలర్ లోనే చెప్పామని అర్ధమైపోతుంది.
 
రవితేజ గారి నుంచి ఏ విషయాలు గ్రహించారు ?
-రవితేజ గారి ఎనర్జీ లెవెల్స్ ఒక ఎత్తు.. అయితే ముఖ్యంగా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన నటుడు. ఆయన ఆహారపు అలవాట్లు, నిద్రపోయే వేళలు పర్ఫెక్ట్ గా వుంటాయి. చాలా ఆనందమైన జీవితం గడుపుతుంటారు. సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ వున్న మనిషి.
 
ఈ సినిమాకి ఈగల్ అని పేరుపెట్టడానికి కారణం ?
-ఈగల్ నాలుగు కిలోమీటర్ల ఎత్తులో వున్నా కిందవున్న రాబిట్ ని చూడగలదు. ఇందులో హీరోకి ఆ ఐ పవర్ వుంది. అలాగే ఈ పాత్రకు సినిమాలో కోడ్ నేమ్ కూడా ఈగల్.  హిందీలో కూడా ఈ పేరు పెట్టడానికి ప్రయత్నించాం. ఇదే పేరుతో అక్కడ ఓ సినిమా వుంది. దీంతో ఈ కథలో హీరో పేరు 'సహదేవ్ వర్మ' టైటిల్ తో హిందీలో విడుదల చేస్తున్నాం .  
 
డీవోపీ, దర్శకత్వం రెండిటిలో ఏది ఇష్టపడతారు ?
-నాకు స్టొరీ తెల్లింగ్ ఇష్టం.  అయితే డీవోపీ యాక్సిడెంటల్ గా జరుగుపోయింది. దాన్ని ఒక బ్లెస్సింగ్ గానే భావిస్తాను.
 
నవదీప్ గారి పాత్ర ఎలా వుంటుంది ? అనుపమ, కావ్య పాత్రలు ఎలా వుంటాయి ?
-నవదీప్ పాత్ర చాలా కీలకంగా వుంటుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో అలోచల్ని కాంప్లీమెంట్ చేసే పాత్రలో నవదీప్ కనిపిస్తారు. నవదీప్ తన నటనతో సర్ ప్రైజ్ చేశారు. తనకి చాలా మంచి మెమరీ పవర్ వుంది. అలాగే అనుమప ఈ కథని ముందుకు నడిపించే పాత్రలో కనిపిస్తారు. కావ్య పాత్ర ఈ కథకు మరో కారణం. మరో చిన్న పాప పాత్ర కూడా కీలకంగా వుంటుంది.
 
ఈగల్ లో మీకు సవాల్ గా అనిపించిన అంశాలు ఏమిటి ?
-ఫిల్మ్ మేకింగ్ లో లోతుగా వెళ్ళే కొలది సవాళ్ళు ఎదురౌతూనే వుంటాయి. మనకి వున్న అనుభవంతో ఐదు రోజుల్లో ఓ సీక్వెన్స్ ని పూర్తి చేసేస్తామని అనుకుంటాం. కానీ అనుకున్న సమయానికి ఫినిష్ కాదు. ఈగల్ లో క్లైమాక్స్ ఎపిసోడ్ ని వారం రోజుల్లో తీసేయొచ్చు అనుకున్నాను. కానీ అది 17 రాత్రుళ్ళు పట్టింది.  దాని కోసం అన్ని రియల్ ఎఫెక్ట్స్ ప్రయత్నించాం. ఈ క్రమంలో దాదాపు నాలుగువందల మందిని ఇబ్బంది పెట్టాను( నవ్వుతూ). చాలా అద్భుతంగా వచ్చింది.
 
ఈగల్ సౌండింగ్ కొత్తగా అనిపిస్తోంది ? దాని గురించి ?
-ఈగల్ సౌండ్ డిజైన్ ఆరు నెలలు చేశాం. అన్ని రియల్ గా ప్రోడ్యుస్ చేశాం. యూరప్ లో రియల్ గన్స్ తో షూట్ చేసి ఆ సౌండ్ ని రికార్డ్ చేశాం. నేపధ్య సంగీతంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మంచి థియేటర్లో చూస్తే ఆ ఎక్సపీరియన్స్ ని ఫీల్ అవ్వొచ్చు. డేవ్ జాండ్ పదేళ్ళుగా తెలుసు. తనతో మంచి జర్నీ వుంది.
 
మణి బాబు డైలాగులు బావున్నాయి ? ఆయన్ని తీసుకోవాలనే ఆలోచన మీదేనా ?
-ఆయనతో నేను కార్తికేయ 2 చేశాను. అప్పటినుంచి మా మధ్య అనుబంధం ఏర్పడింది. మాకు మంచి బ్యాలెన్స్ కుదిరింది. తన పదప్రయోగం చాలా బావుటుంది.  
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పని చేయడం ఎలా అనిపించింది ?
-పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు హోం బ్యానర్ లా అయిపోయింది. సినిమాకి కావాల్సిన ప్రతిది ఒక్క ఫోన్ కాల్ తో సమకూర్చుతారు. నిర్మాత విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి కృతజ్ఞతలు.
 
దర్శకుడిగా మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ?  
-తేజ సజ్జాతో ఓ సినిమా చేస్తున్నాను. త్వరలోనే ఆ సినిమా గురించి తెలియజేస్తాం.