బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 27 జూన్ 2023 (17:17 IST)

అమ్మాయిలూ తప్పులు చేస్తున్నారు జాగ్రత్త : హీరో నాగ శౌర్య కామెంట్

Naga Shaurya
Naga Shaurya
హీరో నాగశౌర్య అమ్మాయిలనుద్దేశించి ఓ సూచన చేశారు. మిమ్మల్ని ప్రేమతో చూసుకునేవారినే పెండ్లి చేసుకోండి. మిమ్మల్ని కొట్టేవారిని కాదు అని ఖరాఖండిగా చెప్పారు. ఇటీవలే కూకట్‌ పల్లి ప్రాంతంలో రోడ్డుమీద ఓ అమ్మాయిని ఓ అబ్బాయి కొట్టడం చూసి ఆయన కారు దిగివారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయమై ఈరోజు ఆయన నటించిన రంగబలి సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ఓప్రశ్నకు సమాధానం చెప్పారు. అక్కడ అసలు ఏం జరిగింది? అనే ప్రశ్న వేయగానే ఆయన సమాధానం చెప్పారు.
 
నేను ఓ పనిమీద కూకట్‌పల్లి వెలుతున్నా. రోడ్డుమీద ఓ అమ్మాయిని అబ్బాయి కొడుతున్నాడు. నేను వెళ్ళి వారించాను. కానీ ఆ అమ్మాయి నా లవర్‌ కొడతాడు. తిడతాడు అంటూ నాకే ధమ్కీ ఇచ్చింది. ఈ విషయంలో ఆ అమ్మాయిదే తప్పు. నేను పోలీసు కంప్లయిట్‌ ఇద్దామనుకున్నా. ఆ విషయం చెప్పగానే. నన్ను చంపినా పర్వాలేదు. వాడే నా మొగుడు అంటూ చెప్పడంతో నాకేం చేయాలో అర్థంకాలేదు. ఈమధ్య అమ్మాయిలు ఇలాగా మారిపోయారా అని ఆశ్చర్య పోయా. అయితే ఈ విషయమై కొందరు నేనే పబ్లిసిటీ కోసం ప్లాన్‌ చేశారని అన్నారు. అందులో వాస్తవం లేదు. అని అన్నారు.
 
అందుకే కొందరు అమ్మాయిల తప్పులు చేస్తున్నారు. ఎవరిని నమ్మాలో.మీరే  తేల్చుకోండి అని వారికి సలహా ఇచ్చారు.