శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 జూన్ 2023 (12:02 IST)

భార్యతో విభేదాలు.. మాట్లాడుదాం రమ్మని అత్త మామలకు పిలుపు... అత్తను హత్య చేసిన అల్లుడు

murder
కట్టుకున్న భార్యతో భర్తకు విభేదాలు తలెత్తాయి. దీంతో విడాకులు తీసుకునేందుకు వారిద్దరూ నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇంతలో మాట్లాడుకుందాం రమ్మని అత్తామామలను విజయవాడ ఫ్లై ఓవర్ వద్దకు రావాలని అల్లుడు పిలిచాడు. అతని మాటలు విని బ్రిడ్జి వద్దకు వచ్చిన అత్తమామలపై అల్లుడు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడి నుంచి మామ తప్పించుకుని పారిపోయాడు. కానీ, అత్తను మాత్రం కత్తితో పొడిచి చంపేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 
 
విజయవాడ నగర శివారు ప్రాంతమైన జక్కంపూడికి చెందిన నాగమణి రెండో కుమార్తెతో అల్లుడికి విభేదాలు వచ్చాయి. దీంతో వారిద్దరూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో అత్తమామలపై కక్ష పెంచుకున్న అల్లుడు రాజేశ్.. పథకం ప్రకారం వారితో మాట్లాడాలని ఫ్లై ఓవర్ ప్రాంతానికి పిలిచాడు. 
 
వారు అక్కడకు రాగానే బైక్‌పై ఉన్న మామను నరికేందుకు ప్రయత్నించగా, అతను తప్పించుకుని పారిపోయాడు. ఆ తర్వాత అత్తపై రాజేశ్‌ విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన నాగమణి మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.