సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 23 జనవరి 2025 (19:21 IST)

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

Sukka nere song sean
Sukka nere song sean
సినిమా విడుదలయిన తర్వాత అందులో ఏదో ఒక పాటను మరలా జోడించడమో రిలీజ్ చేయడమో జరుగుతుంది. తాజాగా బాలక్రిష్ణ నటించిన డాకు మహారాజ్ లో ఓ సాంగ్ ను నేడు విడుదల చేశారు. రాయలసీమలోని నీటి కరువు కష్టాలను ఉటంకిస్తూ నేపథ్యంగా తీసుకున్నారు. పాటలోకి వెళితే..  సుక్క నీరే సుక్కనీరే.. ఒక్క పూట సిక్కదాయే  వచ్చి దాహం తీర్చవయ్యా ఊరికి... అనే పాటను ఈరోజు రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ గీతాన్ని బేబి రియా సీపన ఆలపించారు. థమన్ సంగీతం సమకూర్చారు.
 
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్' చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు.  ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. 'డాకు మహారాజ్' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ సంచలన వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది.