1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. In Game Changer Ram Charan imitated Megastar in the Raa. Maccha Maccha song

గేమ్ చేంజర్ లో రా.. మచ్చా మచ్చా సాంగ్ లో మెగాస్టార్ ను అనుకరించిన రామ్ చరణ్

Ramcharan.. macha song
Ramcharan.. macha song
రామ్ చరణ్ మూవీ ‘గేమ్ చేంజర్’ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తుండగా పూర్తి పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో నుంచి తాజాగా ‘రా మచ్చా మచ్చా’ అనే రెండో లిరికల్ సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో హుషారుగా సాంగ్ కు డాన్స్ సమకూర్చారు. సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి కటౌట్ కూడా వుంది. అలాగే చిరంజీవి వేసిన పాపులర్ స్టెప్ ను కూడా చరణ్ వేసి ఫ్యాన్స్ ను అలరించారు.
 
వందలా మంది ఈ డాన్స్ లో పాల్గొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్.జె.సూర్య  విలన్ గా, అంజలి, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు.
తర్వాతి కథనం
మిథున్ చక్రవర్తికి హృదయపూర్వక అభినందనలు : పవన్ కళ్యాణ్