బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (16:36 IST)

నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది : చిరంజీవి

chiranjeevi
తనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌‍లో చోటుదక్కడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహుకలకు సినీ ప్రముఖులకు, కోట్లాది మంది సినీ అభిమాలను ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. నా హృదయం ఉప్పొంగి పోయిందంటూ పేర్కొన్నారు. ఆయన చేసిన ట్వీట్‌లోని అంశాలను పరిశీలిస్తే, 
 
'గిన్నిస్ రికార్డు లేదు ఏదో ఒకటి. నేనెప్పుడూ ఊహించలేదు. సంవత్సరాలుగా నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్క నా నిర్మాత మరియు దర్శకుల వల్లనే ఇది సాధ్యమైంది. అద్భుతమైన పాటలను కంపోజ్ చేసిన సంగీత దర్శకులు, నాకు కొన్ని మరపురాని డ్యాన్స్ మూవ్‌లను అందించిన కొరియోగ్రాఫర్‌లు, ఇన్నాళ్లూ నా పనిని మెచ్చుకున్న సినీ ప్రేక్షకులందరూ, మిత్రులు, సహోద్యోగులు, నా ప్రియమైన అభిమానులందరికీ, కుటుంబ సభ్యులకు, సినీ ప్రముఖులకు, పెద్దలకు, రాజకీయ, మీడియా ప్రముఖులకు, పాత్రికేయులకు, గౌరవ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు మరియు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రతి ఒక్కరి ఆప్యాయత, శుభాకాంక్షలు, మీ అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు కృతజ్ఞుడిని' అంటూ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.