గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2024 (17:39 IST)

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

Vishwambhara
Vishwambhara
మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ చిత్రం తాజా అప్ డేట్ ఈరోజు పోస్ట్ చేసింది చిత్ర యూనిట్. 10-1-2025న విశ్వంభర విజృంభణ, ఆగమనం అంటూ పోస్ట్ చేశారు. మరోవైపు ఈ సినిమా పనులు అన్నీ శరవేగంగా పూర్తి అవుతున్నాయి.
 
చిరంజీవి కెరీర్ లో ఇది ప్రత్యేక చిత్రంగా మలిచేట్లుగా రూపొందుతోంది. విదేశీ ఫైటర్లతో యాక్షన్ సీన్స్ ఇటీవలే చిత్రీకరించారు. హైదరాబాద్ శివార్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో కీలక సన్నివేశాలు తీశారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ చిత్రం నిర్మిస్తోంది. అయితే సంక్రాంతికి పలు అగ్ర హీరోల సినిమాలు కూడా విడుదలకాబోతున్నాయి.