ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2024 (16:19 IST)

నటి ఫరియా అబ్దుల్లాలో చాలా కళలున్నాయ్

Faria Abdullah
Faria Abdullah
నటీనటులకు నటనతోపాటు పలు కళలలో ప్రావీణ్యం వుండడం అరుదుగా జరుగుతుంటుంది. నటీమణులు నిర్మాతలుగా మారడం తెలిసిందే. కానీ నటి ఫరియా అబ్దుల్లాలో రచయిత, గాయనీ కూడా వుంది. అంతేకాదు కొరియోగ్రపీ కూడా తనే చేసుకుంటుంది. దీనితోపాటు ఆమెకు దర్శకత్వం చేయాలనే కోరిక కూడా వుండిందని గతంలోనే చెప్పింది. సో. తాజాాగా ఆమె నటించిన చిత్రం మత్తువదలరా 2 సినిమాలో ఆమె నటించింది. పోలీస్ ఆఫీసర్ గా ఆమె నటించింది. 
 
దీని గురించి ఆమె చెబుతూ,  ఈ సినిమా ఫుల్ సస్పెన్స్ కామెడీ ఎంటర్టైనర్ వుంటుంది. నేను చెప్పొచ్చో చెప్పకూడదో కానీ.. ఈ సినిమా టీమ్ తో పనిచేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాలో నేను నా సొంతంగా ఒక ర్యాప్ సాంగ్  రాసి పాడాను. అలాగే దీనికి డ్యాన్స్ కొరియోగ్రఫీ కూడా నేనే చేశాను అని చెప్పారు. మరి పాట విడుదలయ్యాక ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సిందే.