మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2024 (11:19 IST)

యాక్షన్ సన్నివేశాల్లో మత్తు వదలారా 2 - ఫరియా అబ్దుల్లా గన్ లుక్

Faria Abdullah's gun look
Faria Abdullah's gun look
హీరోయిన్ ఫారియా అబ్దుల్లా నిధి పాత్రలో 'మత్తు వదలారా2' లో కనిపించనున్నారు. ఆమె  ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో చూస్తున్న ఫారియా యాక్షన్ పోస్టర్ ఉంది. ఇందులో ఆమెపై యాక్షన్ పార్ట్ కీలకంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెపుతోంది. గ్లామర్ రోల్స్ చేసే ఫారియా ఈ చిత్రంతో యాక్షన్ రాణిగా మారుతుందేమో చూడాలి. 
 
శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్‌ మూవీ 'మత్తు వదలరా'. ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ సీక్వెల్‌ 'మత్తు వదలారా 2' తో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 
 
ఈ చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రతి పాత్ర కీలకంగా ఉండబోతోంది. ప్రముఖ నటులు చేరడంతో ఎంటర్ టైన్మెంట్ నెక్స్ట్ లెవల్ లో వుండబోతోంది. 
 
ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తుండగా, సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
 
మత్తు వదలారా 2 సెప్టెంబర్ 13న గ్రాండ్ గా విడుదల కానుంది.  
 
తారాగణం: శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్.