ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2024 (16:04 IST)

పుష్ప 2 పై గోసిప్స్ నమ్మవద్దు - ప్రీమియర్స్ ఉంటాయి

Producer Ravishankar
Producer Ravishankar
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అవన్నీ నమ్మవద్దని చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ నేడు అప్ డేట్ ఇచ్చారు. నేడు ఆయన నిర్మాణంలో రూపొందిన మత్తువదలరా 2 టీజర్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్ప 2 గురించి అడగ్గానే.. వెంటనే ఆయన రియాక్ట్ అయ్యారు. 
 
వినాయకచవితికి ఎటువంటి అప్ డేట్ వుండదు. సెప్టెంబర్ లో ఒకటి, అక్టోబర్ లో ఒక సాంగ్ రిలీజ్ చేస్తాం.  నవంబర్లో అన్ని వివరాలు తెలియజేస్తాం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ వైరల్ అయ్యాయి. ఇంకా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలోనూ పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ రేపు ఈ సినిమా విడుదలయ్యాక తప్పని ఒప్పుకుంటారు.  డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినా వాటిని ఇటీవల సుకుమార్, బన్నీ ఖండించారు. కనుక పుష్ప 2 సినిమా మొదటి పార్ట్ కంటే చాలా బాగుంటుంది. అల్లు అర్జున్ రేంజ్ మామూలుగా వుండదు అన్నారు.