సోమవారం, 23 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (13:35 IST)

గిన్నిస్ వరల్డ్ రికార్డ్సులో మెగాస్టార్‌కు చోటు... ప్రశంసల వెల్లువ (Video)

Nagababu
మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కింది. 150కి పైగా చిత్రాల్లో నటించిన, అత్యధికంగా వైవిధ్యభరితమైన స్టెప్పులతో ఆలరించినందుకుగాను ఈ అరుదైన రికార్డు దక్కింది. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్‌కు సినీ, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా తన ట్విట్టర్ వేదికగా అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవికి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
 
'నేను డిగ్రీ చదివేప్పుడు నా దగ్గర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకం ఉండేది. అందులో సినిమా సంబంధిత రికార్డ్స్ నేను అంతగా చూడలేదు. ఏవైనా అద్భుతమైన సెట్స్ వేసినప్పుడో, బాండ్ చిత్రాల వంటి వాటిల్లో బోట్‌తో లాంగ్ జంప్స్ చేసినప్పుడో ఇలా కొన్ని రికార్డ్స్ గురించి మాత్రమే చదివాను. అవి కూడా చాలా తక్కువలో తక్కువ. నాకు తెలిసి ఒక ఐదు శాతం మాత్రమే సినీ సంబంధిత రికార్డ్స్ ఉండివుండొచ్చు.
 
కానీ, అన్నయ్యకి 156 చిత్రాలలో 537 పాటల్లో 24 వేల డాన్స్ మూమెంట్స్ చేసినందుకుగాను ఇలాంటి అరుదైన రికార్డ్ గిన్నిస్ బుక్‌లో నమోదు చేస్తూ పురస్కరించినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్ అన్నయ్య" అని మెగా బ్రదర్ ట్వీట్ చేశారు.