విశాల్ హీరోగా , సుందర్. సి దర్శకత్వంలో ‘మొగుడు’
విశాల్, సుందర్. సి కాంబోలో ఇది వరకు వచ్చిన ఆంబళ, మద గద రాజా చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టే క్రమంలో ఈ ఇద్దరూ కలిసి మొగుడు అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. డా.ఎ.సి.షణ్ముఖం ఆశీస్సులతో అవని సినిమాస్ ప్రై.లి., బెంజ్ మీడియా ప్రై.లి. బ్యానర్లపై ఈ మూవీని అరుణ్ కుమార్, ఖుష్బూ సుందర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవదీప్, సంపత్, అజయ్ ఘోష్, గరుడ రామ్, వీటీవీ గణేష్, యోగి బాబు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
మొగుడు సినిమాకి సంబంధించిన టైటిల్ ప్రోమోను ఇదివరకే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఓ సాధారణ మొగుడిలా ఇంట్లో అన్ని పనులు చేస్తూనే.. అండర్ కవర్ పోలీస్‌లా రౌడీలను హీరో విశాల్ చితక్కొడుతారు. అన్ని రకాల అంశాల్ని జోడించిన ఈ మూవీని ఫుల్ మాస్ కమర్షియల్ యాంగిల్‌లో సుందర్. సి ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా టైటిల్ ప్రోమోతో చెప్పకనే చెప్పేశారు. ఇక సుందర్. సి ఇప్పటివరకు తీసిన 40కి పైగా చిత్రాలకు మాస్ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మొగుడు మూవీని కూడా వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఉండేట్టు ప్లాన్ చేసుకుంటున్నారు.
మొగుడు టీం ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక నెక్ట్స్ షెడ్యూల్‌ను కోల్‌కత్తా, గోవా, చెన్నైల్లో ప్లాన్ చేశారు. ఈ మూవీకి హిప్‌హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నారు. రోడ్జర్ ఎడిటర్‌గా, గోపీ అమర్ నాథ్ కెమెరామెన్‌గా, గురు రాజ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
నటీనటులు : విశాల్, తమన్నా, నవదీప్, సంపత్, అజయ్ ఘోష్, గరుడ రామ్, వీటీవీ గణేష్, యోగి బాబు తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : అవని సినిమాస్ ప్రై.లి., బెంజ్ మీడియా ప్రై.లి.
మ్యూజిక్ : హిప్ హాప్ తమిళ
డీఓపీ : గోపీ అమర్ నాథ్
ఎడిటర్ : రోడ్జర్
ఆర్ట్ : గురు రాజ్
కొరియోగ్రఫీ : బృందా
నిర్మాతలు : అరుణ్ కుమార్, ఖుష్బూ సుందర్
దర్శకుడు : సుందర్.సి