1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Jendapy kapiraju movie

జెండాపై కపిరాజు విడుదలకు సిద్ధం

Jendapy kapiraju movie
నాని, అమలా పాల్, రాగిణి ద్వివేది హీరో హీరోయిన్స్‌గా శంబో శివశంబో వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన సముద్రఖని దర్శకత్వంలో రామ్మోహన్ రావు సమర్పణలో మల్టీ డైమన్షన్ ప్రై లి. పతాకంపై రజత్ పార్థసారధి, ఎస్ శ్రీనివాసన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం జెండాపై కపిరాజు ఇటివలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న త్వరలో విడుదలకు సిద్ధం అయ్యింది. 
 
ఈ సందర్భంగా ఇటివల ప్రసాద్ లాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మల్టిడైమన్షన్ వాసు మాట్లాడుతూ... ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఇటివలే సెన్సార్ కార్యక్రమాలు కుడా పూర్తయ్యాయి. ఈ రోజు నుండి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ప్రారంబించాము. ఈ నెలలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
 
హీరో నాని మాట్లాడుతూ .. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సినిమాకు కష్టపడిన దానికంటే కుడా ఈ సినిమాకు ఎక్కువగా కష్టపడ్డాను. ఈ సినిమాలో ద్విపాత్రాబినయం చేస్తున్నాను. అయితే ఈ సినిమా ప్రివ్యు చూసుకున్న తరువాత చాలా గర్వంగా ఫీలయ్యాను. తప్పకుండా ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుంది. ఇంత మంచి అవకాశం కలిగించిన సముద్రఖని అన్నయ్యకు నా థాంక్స్ అన్నారు.
About Writer
ivr