సంబంధిత వార్తలు
- ఎమ్మెల్యే భాషను చూసి నవ్వుకుంటున్న ప్రజలు... ప్రచారానికి వద్దంటూ గోల
- కూకట్పల్లి టీడీపీ అభ్యర్థి ఆస్తి వివరాలు... ఆస్తి విలువ రూ.కోటి.. అప్పులు కోటి
- ఎవరిష్టం వారిది.. వస్తే రావొచ్చు.. రాకపోతే పోవచ్చు.. బాలయ్య
- ఎన్నికల బరిలో సుహాసిని.. ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ ప్రచారం చేస్తారా? లేదా?
- నందమూరి సుహాసిని ఎంపిక వెనుక చంద్రబాబు వ్యూహం ఏంటి?
హరిక్రిష్ణ మరణం నవ్వు తెప్పిస్తోంది - బాలక్రిష్ణ సంచలన వ్యాఖ్యలు
నందమూరి బాలక్రిష్ణ మరోసారి తెలిసీ తెలియక చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. అది కూడా తన అన్న హరిక్రిష్ణ మరణంపై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారితీస్తోంది. రోడ్డుప్రమాదంలో హరిక్రిష్ణ మరణించిన తరువాత ఒక్కసారి నందమూరి కుటుంబం విషాధాల్లోకి వెళ్ళిపోయింది. నందమూరి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న హరిక్రిష్ణ మరణించడంతో కొన్నిరోజుల పాటు ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కానీ తాజాగా హరిక్రిష్ణ మరణంపై బాలక్రిష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. హరిక్రిష్ణ కుమార్తె నందమూరి సుహాసిని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా సుహాసిని బాలక్రిష్ణను వెంట పెట్టుకుని నందమూరి ఘాట్ వద్దకు వెళ్ళింది. అయితే అక్కడ మీడియాతో మాట్లాడిన బాలక్రిష్ణ హరిక్రిష్ణ మరణం తీరని లోటని చెప్పాల్సింది పోయి హరిక్రిష్ణ మరణం సంభ్రమాశ్చర్యంలోకి మమ్మల్ని పడేసింది అన్నారు.
దీని అర్థం కావాల్సినంత ఆనందమని. దీంతో ఒక్కసారిగా హరిక్రిష్ణ కుమార్తె సుహాసిని ఆశ్చర్యపోయారు. బాలక్రిష్ణకు ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయారు. బాలక్రిష్ణ తెలిసి మాట్లాడారో..తెలియక మాట్లాడారో తెలియక టిడిపి నేతలు ఆలోచనలో పడ్డారు. కానీ గతంలో కూడా బాలక్రిష్ణ ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో చేశారు.
