సాయిబాబా ఆలయంలో 3,700 కిలోల కిచ్డీ తయారీ.. గిన్నిస్ రికార్డ్ ఖాయమా?
Kichidi
కిచిడీ తయారు చేసిన అనంతరం ఆలయానికి తరలివచ్చిన 15 వేల మంది భక్తులకు ఈ కిచ్డీని పంచిపెట్టారు. తయారీ నుండి పంపిణీ వరకు మొత్తం ప్రక్రియ రికార్డ్ చేయబడింది. ధృవీకరణ కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బృందానికి పంపబడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ప్రసాదం తయారీకి దాదాపు రూ. 5 లక్షలు ఖర్చవుతుందని, నిపుణుల బృందంతో వంట నాణ్యతను పరిశీలించామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వీరి సృజన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంటుందని ఆలయ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
